మోకాళ్ల నొప్పుల సమస్యతో బాధ పడుతున్నారా.. వేగంగా చెక్ పెట్టే అద్భుత చిట్కాలివే!

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది చిన్న వయస్సులోనే మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. మోకాళ్ల నొప్పుల వల్ల నడవడానికి సైతం ఇబ్బందులు పడుతున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది ఈ సమస్యకు చెక్ పెట్టడానికి పెయిన్ కిల్లర్స్ పై ఆధారపడుతున్నారు.

తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. తీవ్ర మోకాళ్ల నొప్పులతో బాధ పడేవాళ్లు నొప్పి ఉన్నచోట అలోవెరా జెల్ రాసి మర్ధనా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేయడం ద్వారా మోకాళ్ల వాపు సమస్య కూడా దూరమవుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధ పడేవాళ్లు ఆవనూనెలో పసుపు వేసి కలుపుకొని నొప్పి ప్రభావిత ప్రాంతంలో రాస్తే మంచిది.

గ్లాస్ నీళ్లలో అల్లం ముక్కలను వేసి మరగబెట్టి తేనె, నిమ్మరసం కలిపి అప్లై చేస్తే కూడా ఆశించిన ఫలితాలను పొందవచ్చు. కర్పూరం నూనెను వాడటం ద్వారా తీవ్ర మోకాళ్ల నొప్పుల సమస్యకు చెక్ పెట్టవచ్చు. నొప్పి ప్రభావిత ప్రాంతంలో కర్పూరం నూనెను మసాజ్ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

చింత గింజల పొడిని వేడినీళ్లలో వేసి మరగబెట్టి వడగట్టి తాగుతూ ఉండటం ద్వారా నొప్పుల నుంచి సహజంగా ఉపశమనం లభిస్తుంది. ఈ చిట్కాలు పాటించినా మోకాళ్ల నొప్పులు తగ్గని పక్షంలో వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు బరువు కంట్రోల్ లో ఉంచుకుంటే మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు.