Health Tips: సాధారణంగా వాతావరణంలో మార్పులు కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలామంది దగ్గు జలుబు వంటి సమస్యలు బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఎన్నో రకాల మందులు వాడుతున్నప్పటికీ కూడా పెద్దగా ప్రయోజనాలు లేకుండా పోయాయి. ఇలా దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు మన ఇంట్లో దొరికే వాటితోనే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు.
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వంటింట్లో ఎన్నో రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తూ ఉంటాము. ఇలా మన వంటింట్లో దొరికే కొన్ని దినుసులతో సహజంగా ఈ దగ్గు జలుబుకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజు మనం తయారు చేసుకునే తాగే టీలో కాస్త అల్లం ముక్కలు వేసుకొని తయారు చేసుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు అలాగే తులసి ఆకులను నేరుగా నమిలి మింగటం వల్ల కూడా కాస్త ఉపశమనం పొందవచ్చు. ఇకపోతే టీ బదులుగా గ్రీన్ టీ తాగటం వల్ల అందులో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తొందరగా మనకు దగ్గు జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఇలా దగ్గు జలుబు సమస్యతో బాధపడే వారికి ఈ చిట్కాలు మంచిగ ఉపయోగపడతాయి. ఇక అప్పటికి తగ్గకపోతే పాలను బాగా మరిగించి అందులో రెండు తులసి ఆకులు రెండు మిరియాలు, చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి ఇలా మరిగిన పాలను దించే ముందు చిటికెడు పసుపు వేసి ఆ పాలను వడబోసుకొని ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగటం వల్ల ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా సహజసిద్ధంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.