నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కారొరేషన్ లో ఉద్యోగ ఖాళీలు.. ఒకింత భారీ వేతనంతో?

నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ఛత్తీస్ గఢ్ లో ఉన్న ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 934 కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, బీటెక్, బీఈతో పాటు డిప్లొమా, ఐటీఐ, పీజీ, సీఏ, సీఎంఏ్, ఎంబీఏ, పీజీడీఎం పాస్ కావడంతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు వయో పరిమితి 50 సంవత్సరాలుగా ఉంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 40,000 రూపాయల నుంచి 1,70,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మే నెల 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.