వర్షాకాలంలో పాదాలు సంరక్షణకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

వర్షాకాలం అంటేనే వ్యాధులకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఈ వర్షాకాలంలో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు జ్వరం వంటి ఆరోగ్య సమస్యలతో పాటు ఎక్కువగా నీటిలో నానటంవల్ల పాదాల సమస్యలు తలెత్తుతుంటాయి. వర్షాకాలంలో పాదాలు నీటిలో ఎక్కువ సేపు నానటం వల్ల పాదాలు దురదలు పెట్టడం, చర్మం పొలుసులుగా రాలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా మహిళలు పాదాల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ద వహిస్తారు. మహిళలకి ముఖ సౌందర్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో పాదాల సంరక్షణలో కూడా అంతే శ్రద్ద తీసుకుంటారు.

చాలామంది వేల రూపాయలు కర్చు చేసి బ్యూటీ పార్లర్ లో పెడిక్యుర్ చేయించుకుంటారు. అయితే పాదాల సంరక్షణక ఇలా వేల రూపాయలు ఖర్చు చేయకుండా మన ఇంట్లో లభించే కొన్ని పదార్థాల ద్వారా పాదాల సమస్యలను దూరం చేయవచ్చు. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. పాదాలు పొడి బారటం, చర్మం పొలుసులు ఊడిపోవడం, దురద, పాదాలు పగలటం వంటి సమస్యలతో బాధపడే వారు ఒక బకెట్ గోరు వెచ్చని నీటిలో కొంచం ఉప్పు వేసి పాదాలను అందులో ఉంచాలి. ఇలా చేయటం వల్ల పాదాల దురదలు తగ్గుతాయి.

పాదాలు పొడిబారటం వంటి సమస్యలని నివారించడంలో పెప్పర్‌మింట్ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది. పాదాలు పొడిబారిన వారు కొన్ని నీళ్లు తీసుకొని దానిలో కాస్త పెప్పర్‌మింట్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని పాదాలకు రాయటం వల్ల పొడి చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తుంది. పాదాల చర్మం పొడిబారటం వల్ల అరికాళ్లలో దురద తలెత్తుతుంది. ఆ సమయంలో పెట్రోలియం జెల్లీతో పాదాలు మర్దన చేయటం వల్ల ఇది తేమ నిలిచి ఉండేలా చేసి, దురద తగ్గుముఖం పట్టేలా చేస్తుంది.