ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా నీళ్ళు తాగుతున్నారా…ఇది తెలుసుకోవాల్సిందే?

సాధారణంగా ఉదయం, రాత్రి బ్రష్ చేయం వల్ల నోటిలో క్రిములు దూరమయి దంతాల సమస్యలు దరిచేరవని నిపుణుల సూచిస్తున్నారు. కానీ ఎక్కువ శాతం మందికి రాత్రిపూట బ్రష్ చేసే అలవాటు ఉండదు. అందువల్ల నోటిలో క్రిములు ఏర్పడతాయి. అయితే సాధారణంగా ఎవరూ బ్రష్ చేయకుండా ఏమీ తినరు, తాగరు. కానీ బెడ్ కాఫీ అలవాటు ఉన్న వారు మాత్రం ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ తాగుతారు. అయితే ఈ కాఫీ సంగతి పక్కన పెడితే ఉదయం లేవగానే మంచి నీళ్ళు తాగే అలవాటు అందరికి ఉంటుంది. అయితే ఇలా బ్రష్ చేయకుండా మంచి నీళ్ళు తాగటం వల్ల నోటిలో ఉన్న క్రిములు మన శరీరంలోకి వెళ్లి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చాలా మంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా బ్రష్ చేయకుండా నీటిని తాగటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందా? లేదా? అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోజూ ఉదయం లేవగానే నీళ్లు బ్రష్ చేయకుండా నీళ్ళు తాగటం వల్ల ప్రమాదం ఉండదని సర్టిఫైడ్ యోగా ఇన్‌స్ట్రక్టర్, హోమియోపతి డాక్టర్ అయిన డా. నూపర్ రోహ్‌తగి వెల్లడించారు. అంతే కాకుండా ఇలా బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. నిద్రపోయినప్పుడు మన నోటిలో ఏర్పడే బ్యాక్టీరియాను మనం మింగడం ద్వారా ఇమ్యూనిటీ పెరిగి దాని వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుందని ఆయన తెలియచేశారు.

ముఖ్యంగా బీపీ ఉన్న వారు ఇలా నీళ్ళు తాగటం వల్ల అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల నోటి ఆరోగ్యంతో పాటు చెడు శ్వాసను కూడా దూరమవుతుంది. సెలైవాను ఉత్పత్తి చేసి నోరు పొడిబారిపోకుండా రీహైడ్రేట్ అయ్యేందుకు హెల్ప్ అవుతుంది. అయితే ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా కొన్ని గోరువెచ్చని నీటిని తాగడం మంచిది ఆయన వెల్లడించాడు. ఇలా గోరువెచ్చని నీరు తాగటం వల్ల మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి. అందువల్ల ప్రతిరోజు ఉదయం లేవగానే పరగడుపునే రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగటం అలవాటు చేసుకోండి.