త్వరగా గర్భం దాల్చాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే.. ఈ టిప్స్ పాటిస్తే చాలంటూ?

కొత్తగా పెళ్లైన దంపతులలో చాలామంది తమ లైఫ్ లోకి మరో చిన్నారిని ఆహ్వానించి సంతోషంగా జీవనం సాగించాలని భావిస్తారు. అమ్మ అని పిలిపించుకోవాలని కలలు కనే మహిళలు ఎంతోమంది ఉన్నారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మహిళలు త్వరగా గర్భం దాల్చే అవకాశాలు అయితే ఉంటాయి. మహిళలు కలయిక అనంతరం జననాంగాలను వెంటనే శుభ్రం చేసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు.

పిల్లలు త్వరగా కావాలని భావించే వాళ్లు మాత్రం ఈ విధంగా చేయాలని వాళ్లు వెల్లడిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా త్వరగా గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. అరటిపండ్లు, బ్రొకోలి, ఆకుపచ్చని కూరగాయలు, గుమ్మడి గింజలు, పాలకూర, దానిమ్మ పండ్లు డైట్ లో భాగం చేసుకోవడం ద్వారా త్వరగా పిల్లలు పుడతారు. మహిళల్లో ఆరోగ్యకరమైన రుతుచక్రం ఉంటే త్వరగా పిల్లల్ని కనే అవకాశం ఉంటుంది.

జీవనశైలిలో మార్పులు, ఆలస్యంగా జరిగే వివాహాలు, తగినంత పోషకాహార లోపం, మహిళల్లో ఋతుక్రమ సమస్యలు, మగవారిలో లైంగిక సమస్యల వల్ల కొన్నిసార్లు గర్భం దాల్చడం ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. శరీరంలో జరిగే రక్త ప్రసరణ కూడా గర్భధారణ ఆధారపడి ఉంటుంది. పోషకాల లోపం వల్ల కూడా కొన్నిసార్లు గర్భధారణ ఆలస్యం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం ద్వారా హార్మోన్ల ఉత్పత్తి పెరిగి సంతానోత్పత్తి పెరుగుతుంది. ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని చికిత్స చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.