కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. అమ్మాయిలకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం మరో పథకాన్ని అమలు చేస్తుండగా ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 35,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. యువతులకు ఇది అదిరిపోయే శుభవార్త అనే చెప్పాలి. సావిత్రిబాయ్ జ్యోతిరావ్ ఫూలే ఫెలోషిప్ ఫర్ సింగిల్ గర్ల్ పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.
ఫ్యామిలీలో ఒకే ఒక్క బాలిక ఉంటే ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబంలో ఒకే ఒక్క బాలిక ఉంటే ఐదు సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మనీ అందిస్తుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకుంటే మంచిది. కుటుంబానికి సంతానంలో బాలిక ఒకరే ఉన్నా లేదా ఇద్దరు బాలికలు ఉన్నా ఒక బాలిక కోసం ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
100 రూపాయల స్టాంప్ పేపర్ ను అఫిడవిట్ రూపంలో సమర్పించి ఆడపిల్లల తల్లీదండ్రులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. కేంద్రం జూనియర్ రీసెర్చ్ ఫెలోస్‌కి నెలకు రూ.31 వేల చొప్పున రెండు సంవత్సరాల పాటు అందించనుందని సీనియర్ రీసెర్చ్ ఫెలోస్‌కి రూ.35,000 చొప్పున 3 సంవత్సరాల పాటు అందించనుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.
యూనివర్శిటీ లేదా కాలేజీ లేదా సంస్థలో పీహెచ్డీ చేస్తూ 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అర్హతలు ఉన్నవాళ్లు 45 సంవత్సరాల లోపు ఉంటే అర్హులు.