40 ఏళ్లు దాటిన వారు సాధారణంగా చేయించుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన వైద్య పరీక్షలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తనిఖీ చేయడానికి, గుండె జబ్బుల ముప్పును అంచనా వేయడానికి, మరియు రక్తనాళాల ఆరోగ్యాన్ని నిర్వహించడానికి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. రక్తపోటును తనిఖీ చేయటం ద్వారా, గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం గురించి తెలుసుకోవచ్చు.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తనిఖీ చేయడానికి, మధుమేహం ఉన్నట్లు గుర్తించడానికి మధుమేహం పరీక్ష ముఖ్యమని చెప్పవచ్చు. థైరాయిడ్ గ్రంధి పనితీరును తనిఖీ చేయడానికి, థైరాయిడ్ సంబంధిత సమస్యలను గుర్తించడానికి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. మహిళలు మామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి, ఇది రొమ్ము క్యాన్సర్ని ముందే గుర్తించటానికి సహాయపడుతుంది.
మహిళలు పాప్ స్మియర్ పరీక్షలు మరియు హెచ్.పీ.వీ పరీక్షలు చేయించుకోవాలి. గర్భాశయ క్యాన్సర్ని ముందే గుర్తించటానికి ఇది సహాయపడుతుంది. ఎముకల సాంద్రతను తనిఖీ చేయటం ద్వారా ఆస్టియో పోరోసిస్ వ్యాధి బారిన పడకుండా రక్షించుకోవచ్చు. కిడ్నీల పనితీరును తనిఖీ చేయడానికి, కిడ్నీ వ్యాధుల ముప్పును అంచనా వేయడానికి మూత్ర పిండాల పనితీరు పరీక్ష చేయించుకోవాలి.
పెద్దపేగు క్యాన్సర్ ముప్పును అంచనా వేయడానికి, మల పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా, 40 ఏళ్లు దాటిన వారు వారి ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, చికిత్స తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది.