రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఏకంగా రూ.11,500 జమయ్యే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాలలో నగదు జమ కానుంది. త్వరలో ఈ స్కీమ్ కు సంబంధించిన 18వ విడత నగదు రైతుల ఖాతాలో జమ కానుందనే సంగతి తెలిసిందే.

అయితే కొంతమంది రైతులు అన్ని అర్హతలు ఉన్నా పీఎం కిసాన్ నగదు జమ కావడం లేదని చెబుతున్నారు. రైతులు ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేస్తారో వాళ్లకు మాత్రమే పీఎం కిసాన్ నగదు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ కేవైసీ పూర్తి చేయని వాళ్లకు నగదు జమ అయ్యే అవకాశాలు దాదాపుగా లేవని చెప్పవచ్చు. ఈ కేవైసీ పూర్తి చేసిన వాళ్లు 17వ విడత డబ్బులు పొందకపోతే రెండు విడతల నగదు ఒకే సారి పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా సులభంగానే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ కార్డ్ లింక్ కాని వాళ్లు వెంటనే లింక్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. తెలంగాణలో ఖరీఫ్ సీజన్ లో అర్హత ఉన్న ప్రతి రైతుకు 7500 రూపాయలు ఖాతాలో జమ కానుంది. ఈ విధంగా రైతులు ఏకంగా 11500 రూపాయలు పొందే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.

రైతులకు ప్రయోజనం చేకూరే దిశగా మోదీ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ రైతులకు మేలు చేస్తున్నారు. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతులు దీర్ఘ కాలంలో ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే మంచిది.