రైతుల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ కార్డు.. ఊహించని స్థాయిలో ప్రయోజనాలతో?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు లాభం కలిగేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ లను అందిస్తుండగా ఈ కార్డ్ వల్ల ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది. రైతులకు తక్కువ వడ్డీకే ఈ కార్డులు లభిస్తాయి. రైతులకు ఆదాయం పెంచాలనే సదుద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

గడువులోగా రుణాలు చెల్లించేవారికి వడ్డీపై సబ్సిడీ కూడా లభించనుంది. 1,60,000 రూపాయల వరకు ఎలాంటి ష్యూరిటీ అవసరం లేకుండా లోన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. పంట కోతలు, మార్కెటింగ్‌ను బట్టి అప్పు తిరిగి చెల్లించే వెసులుబాటు ఉండటంతో రైతులకు మేలు జరుగుతోంది. సమీపంలోని బ్యాంకును సంప్రదించి కిసాన్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ రూ.3,00,000 కాగా రైతుల క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణాలను మంజూరు చేస్తారు. బ్యాంకులను బట్టి వడ్డీ రేటు మారుతుండగా మెజారిటీ బ్యాంకులలో 7 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి. రుణాలను సకాలంలో చెలించిన వాళ్లకు రాయితీ లభిస్తుంది. ఐదేళ్ల లోపు రుణాలు చెల్లించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.

రూ.25,000 క్రెడిట్ లిమిట్‌తో చెక్ బుక్ కూడా లభించే అవకాశం ఉండటంతో రైతులకు మేలు జరుగుతుంది. బ్యాంక్ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పేరు, ఫోన్ నెంబర్ లాంటి బేసిక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి కిసాన్ క్రెడిట్ కార్డ్ ను సులువుగా పొందవచ్చు.