ఉద్యోగాలు చేసేవాళ్లకు మోదీ సర్కార్ అదిరిపోయే తీపికబురు.. భారీగా వేతనాలు పెరిగే ఛాన్స్!

దేశంలో చాలామంది ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్లు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో పని చేసేవాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగం సాధించడం ఎంతోమంది కల అనే సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగాలు చేసేవాళ్లకు మోదీ సర్కార్ అదిరిపోయే తీపికబురు అందించనుందని తెలుస్తోంది. కేంద్రం ఉద్యోగులకు వేతనాలను భారీగా పెంచనుందని భోగట్టా.

వెలువడుతున్న నివేదికలను బట్టి డీఏ, డీఆర్ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉండబోతుందని సమాచారం అందుతోంది. డీఏ, డీఆర్ పెంపు వల్ల ఇతర అలవెన్స్ లు సైతం భారీగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. డియర్‌నెస్ అలవెన్స్ 50% పెరిగితే అలవెన్స్ రేట్లు 25 శాతం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

రివైజ్డ్ పే స్ట్రక్చర్‌పై చెల్లించే డియర్‌నెస్ అలవెన్స్ అనేది 50 శాతానికి చేరిన సమయంలో అలవెన్స్ రేట్లు కూడా 25 శాతం పెరగాల్సి ఉంటుంది. సండర్బన్ అలవెన్స్, ట్రైబర్ ఏరియా అలవెన్స్ లతో పాటు స్పెషల్ కంపెన్సెటరీ (రిమోట్ లొకాలిటీ) అలవెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కన్వేయన్స్ అలవెన్స్ కూడా భారీగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

స్ల్పిట్ డ్యూటీ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్ లతో పాటు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, డ్రెస్ అలవెన్స్ కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ అలవెన్స్ లు పెరిగితే నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.