అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో ఈ తప్పులు చేస్తున్నారా.. చాలా ప్రమాదమంటూ?

అమ్మాయిలు, మహిళలు తమ ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలనే సంగతి తెలిసిందే. ఆరోగ్యానికి సంబంధించి చిన్నచిన్న తప్పులు చేసినా ఆ తప్పులు తీవ్రస్థాయిలో ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చిన్నచిన్న తప్పుల వల్ల కొన్ని సందర్భాల్లో గర్భ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని అలా చేయని పక్షంలో ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రతి 6 గంటలకు ఒకసారి శానిటరీ న్యాప్ కిన్ లను మార్చాలని ప్యాడ్ మార్చిన సమయంలో ప్రైవేట్ పార్ట్స్ ను శుభ్రపరచుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. వాడిన శానిటరీ న్యాప్ కిన్ లను పాడేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు చెబుతున్నారు.

సరైన కేర్ తీసుకోని పక్షంలో దద్దుర్లు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మహిళలు సౌకర్యవంతమైన లోదుస్తులు ధరించడం ద్వారా కూడా నెలసరి సమయంలో ఎదురయ్యే సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నెలసరి సమయంలో పండ్లు, ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశాలు అయితే ఉంటాయి.

నెలసరి సమయంలో గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం ద్వారా హుషారుగా ఉండవచ్చు. పీరియడ్స్ సమయంలో నీళ్లు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. సిలికాన్ మెన్‌స్ట్రువల్ కప్పులను వాడటం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. ఇవి మార్కెట్ లో, ఆన్ లైన్ లో తక్కువ ధరకే లభ్యమవుతాయి.