Bomb: ఏం చేయాలో తెలీక.. బాంబు తయారుచేసి పోలీసులకే ఇచ్చాడు..! ఆ తర్వాత

Bomb: లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన 25 ఏళ్ల యువకుడికి ఏం చేయాలో తెలీలేదు. పని చేస్తున్న సెలూన్ మూసేశారు. తల్లిదండ్రులు చనిపోయారు. ముగ్గురు అక్కచెళ్లెల్లకు పెళ్లిళ్లు అయిపోవడందో ఎవరి దారి వారు చూసుకున్నారు. ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేదు. అద్దె కట్టే దారి లేక నివాసానికి కూడా ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలీక నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. ఏదొకటి చేయాలని చేయకూడని పనే చేశాడు. తర్వాత భయపడ్డాడు.. పోలిస్ స్టేషన్ కే వెళ్లాడు. జరిగింది చెప్పాడు.. ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతున్నాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

‘నాగ్ పూర్ కు చెందిన రాహుల్ పగారే లాక్ డౌన్ పరిస్థితుల్లో ఒంటరయ్యాడు. దీంతో ఏం చేయాలో తెలీక యూట్యూబ్ వీడియోలు చూసి ఏకంగా ఓ బాంబు తయారు చేశాడు. చెల్లెలి సెల్ పోన్లో వీడియోలు చేసి ఈ బాంబు తయారు చేశాడు. అయితే.. తర్వాత దానిని చూసి భయపడ్డాడు. ఆ బాంబుతో ఏం చేయాలో తెలీలేదు. నిర్వీర్యం చేయడం రాలేదు. దీంతో బాంబు తీసుకుని నేరుగా నందన్ వన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. కేడీకే కాలేజ్ వద్ద బాంబు దొరికిందని ఓ బ్యాగ్ ఇచ్చాడు.

దీంతో పోలీసులు ఒక్కసారిగా అలెర్టయ్యారు. రాహుల్ కథనానాన్ని ఎస్ఐ మహ్మద్ షేక్ నమ్మలేదు. నిర్మానుష్య ప్రాంతంలో బాంబు దొరకడమేంటని ఆలోచించి తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆ బాంబును తానే తాయరు చేశానని.. పేలుతుందనే భయంతో తీసుకొచ్చానని చెప్పాడు. యూట్యూబ్ వీడియోలు చూసి తయారు చేసినట్టు ఒప్పుకున్నాడు. పోలీసులు వెంటనే బాంబ్ స్కాడ్ ని పిలిపించారు. ఆ బాంబ్ లో డిటోనేటర్ గానీ.. జిలెటిన్ స్టిక్స్ కానీ లేవని తేల్చారు.

ఫైర్ క్రాకర్స్ కు ఉపయోగించే గన్ పౌడర్, పెట్రోల్ ను ఓ ప్లాస్టీక్ డబ్బాలో పెట్టాడు. చైనా మొబైల్ బ్యాటరీని ఉపయోగించాడు. చైనా బొమ్మను లైట్ వెలిగించేందుకు పెట్టాడు. ఇది పేలే బాంబ్ కాదని తేల్చారు. అయినా..ఇంటిలిజెన్స్ ని, స్టేట్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ని అప్రమత్తం చేసింది. కోర్టు పగారేని రెండు రోజులు పోలీసు కస్టడీకి ఇచ్చింది. ప్రస్తుతం విచారణ జరుగుతోందని ఎస్సై తెలిపారు.