పవిత్రమైన వృత్తిలో ఉంటూ భర్తతో కలిసి దారుణానికి పాల్పడిన నర్స్…

డాక్టర్లు నర్సులను ప్రజలు దేవుడితో సమానంగా భావిస్తారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలైనప్పుడు డాక్టర్లు నర్సులు మన ప్రాణాన్ని కాపాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి మన ప్రాణాన్ని కాపాడుతారు. అందువల్ల డాక్టర్లు నర్సులను ప్రజలు దేవుడితో సమానంగా భావిస్తారు. కానీ ఇలాంటి పవిత్రమైన వృత్తిలో ఉంటూ కొందరు వ్యక్తులు దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలను అపహరించే కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక నర్స్ ఇటువంటి దారుణానికి పాల్పడింది. అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి నుండి అపహరించింది.

వివరాల్లోకి వెళితే…మహారాష్ట్ర లోని కొల్హాపూర్ తాస్గావ్‌ పరిధిలోని పంధర్‌పూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల మోహోల్‌ అనే ప్రాంతానికి చెందిన గర్భిణి ప్రసవం కోసం ప్రైవేట్ ఆస్పత్రి లో అడ్మిట్ అయింది. ఆ గర్భిణీ ఆదివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే స్వాతి చాబు అనే నర్స్ ఈ విషయాన్ని ఆ మహిళకు, ఆమె భర్తకు తెలియకుండా దాచి పెట్టారు. అయితే ప్రసవం అయిన తర్వాత బిడ్డ కనిపించకపోవడంతో మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా హాస్పిటల్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు.

సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న స్వాతి చాబు తన భర్త సహకారంతో అప్పుడే పుట్టిన పసిబిడ్డను అపహరించింది. దీంతో సాంగ్లీ జిల్లాలోని భవానీ నగర్‌లో నివాసం ఉంటున్న నిందితురాలిని ఆమె భర్తని పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న స్వాతి చాబు గతంలో కూడా నర్సుగా పనిచేసింది. అయితే ప్రస్తుతం పని చేస్తున్న ఆసుపత్రిలో ఆమె నకిలీ పేరుతో ఆస్పత్రిలో చేరినట్టు విచారణలో వెల్లడైంది. అయితే పసిబిడ్డను అపహరించిన ఇలాంటి నర్సులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.