అంబేద్కర్ విగ్రహం.! కేసీయార్ మార్క్ పబ్లిసిటీ స్టంట్.!

ఔను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు జరగలేదు. మహారాష్ట్రలోనూ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు నత్త నడకన సాగుతున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా.. అత్యంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేసింది, ఆవిష్కరించేసింది కూడా.

ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌ని అభినందించి తీరాల్సింద. అయితే, ఈ విగ్రహావిష్కరణ కోసం చేసిన హంగామానే అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచీ సుమారు 35 వేల మందిని తీసుకొచ్చింది భాగ్యనగరానికి తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసి మరీ జనాన్ని తరలించడం గమనార్హం. అవసరమా ఇదంతా.? ఇంత ఖర్చు దేనికి.? అంబేద్కర్ ఆశయ సాధన అంటే, విగ్రహాలు పెట్టి పబ్లిసిటీ స్టంట్లు చేయడం కాదు కదా.! కోట్లు వృధా అవుతున్నాయ్ ఇలాంటి కార్యక్రమాల వల్ల.

కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల నిమిత్తం మాత్రమే అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు అన్నది నిష్టుర సత్యం. ఆ ఖర్చుని దళితుల అభ్యున్నతికి ఉపయోగిస్తేనో.? వేల మంది దళితులు లాభపడతారు కదా.? దురదృష్టం.. ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యవుగాక చెయ్యవు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడే తొలి ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీయార్, దళిత ఓటు బ్యాంకు కోసం అంబేద్కర్ విగ్రహం