మెగ్నీషియం లోపం వల్ల ఆ సమస్యలు వేధిస్తున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే ఆ సమస్యలకు చెక్!

మనలో చాలామంది మెగ్నీషియం లోపం వల్ల ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు పడి ఉంటారు. మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తే మెగ్నీషియం లోపం సమస్య వేధిస్తుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మన శరీరానికి అవసరమైన మెగ్నీషియం లభిస్తే ఎముకలు బలంగా ఉండటంతో పాటు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మెగ్నీషియం తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉండటంతో పాటు గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయని చెప్పవచ్చు.

శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన పోషకాలలో మెగ్నీషియం ఒకటి కాగా చిన్న ప్రేగులలో ఆహార పోషకాలను గ్రహించడంలో మెగ్నీషియం తోడ్పడుతుందని చెప్పవచ్చు. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్‌ ద్వారా మనకు శక్తి లభించేలా మెగ్నీషియం చేయడంతో పాటు రక్తంలో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్ధీకరించడంలో ఇది సహాయపడుతుంది.

శరీరంలోని నరాలు ,కండరాల పనితీరును మెగ్నీషియం మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. మన శరీరంలో గ్లూటథయాన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్ తయారు కావాలంటే మెగ్నీషియం కచ్చితంగా ఉండాలి. మన శరీరానికి రోజుకు కనీసం 300 గ్రాముల మెగ్నీషియం అవసరం అవుతుందని చెప్పవచ్చు. మెగ్నీషియం లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ సైతం ఉంటుంది. మెగ్నీషియం లోపిస్తే, కండరాల నొప్పులు, పట్టేయడం డయాబెటిస్‌, కరోనరీ ఆర్టరీ వ్యాధి, బోలు ఎముకల వ్యాధి, ఇతర వ్యాధులు వస్తాయి.

అవకాడో, అరటి పండ్లు, రాస్‌ బెర్రీస్, ఫిగ్స్‌, బ్రకోలీ, క్యాబేజి, పచ్చి బఠానీలు, మొలకలు, బ్రౌన్‌ రైస్, ఓట్స్, సీఫుడ్స్‌ తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన మెగ్నీషియం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జొన్నరొట్టె, ఆల్మండ్ బటర్ టోస్ట్, బనాన ఓట్‌ ప్యాన్ కేక్, పాలకూర దోశ, పెసర మొలకల చాట్ తినడం ద్వారా మెగ్నీషియం లోపాలను అధిగమించవచ్చు.