మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధ పడుతూ ఉంటారు. అయితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే విషయంలో తామర పువ్వులు కీలక పాత్ర పోషిస్తాయి. తామర పువ్వులను పూజలలో సైతం వినియోగించడం జరుగుతుంది. తామర పువ్వులు, తామర గింజల వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
కొన్ని వంటల తయారీలో సైతం తామర పువ్వులను వినియోగించడం జరుగుతుంది. తామర పువ్వులతో చేసిన వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఆయుర్వేదంలో సైతం తామర పువ్వులను వినియోగించడం జరుగుతుంది. ఆయుర్వేదంలో వేర్వేరు ఔషధాల తయారీలో తామర పువ్వులు తోడ్పడతాయని చెప్పవచ్చు.
తామర పువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, మరెన్నో విధాలుగా ఉపయోగపడతాయి. తామర పువ్వులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉన్నాయి, జ్వరం, తలనొప్పి మరియు చికాకు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. తామర పువ్వులు, గింజలు, ఆకులు మరియు కాండాలను ఆహారంగా తీసుకోవచ్చు. అతిసారం, కామెర్లు, గుండె జబ్బుల చికిత్స, దగ్గు, మూలవ్యాధి మరియు రక్తస్రావం తగ్గడానికి తామర పూలను ఉపయోస్తారు.
తామర గింజలు కండరాలను దృఢంగా చేస్తాయి. రేకులు ఫ్లేవనాయిడ్స్ మరియు పాలిఫినాల్స్‌తో సమృద్ధిగా ఉంటాయి. కాడలు జీర్ణక్రియకు సహాయపడతాయి. వేర్లు విటమిన్ సి, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. అధిక బరువును తగ్గించడంలో సహాయపడతాయి, మరియు క్యాన్సర్ నివారణకు కూడా దోహదపడతాయి. తామర పువ్వులు సువాసన కలిగి అందంగా ఉండటం వలన పుష్ప పూజలలో ఉపయోగిస్తారు. తామర పువ్వుల టీని నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించడానికి, మరియు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానిక ఉపయోగిస్తారు.
లోటస్ పువ్వులు పునర్జన్మ మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయంతో అనుబంధాన్ని కలిగి ఉంటాయని చెప్పవచ్చు. తామర పువ్వులు సువాసన కలిగి అందముగా ఉండడం వలన పుష్పపూజలలో ఉపయోగిస్తారు.