శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల ఇన్ని నష్టాలున్నాయా.. ఏం జరిగిందంటే?

మనలో చాలామంది నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, చేతుల వేళ్లు వాపు, మూత్రపిండాల సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలకు యూరిక్ యాసిడ్ కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది.

శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో యూరిక్ యాసిడ్ ఒకటి కాగా మన శరీరంలోని ఆహారాల్లో ప్యూరిన్‌ అనే కెమికల్ విచ్చిన్నం అయిన సమయంలో యూరిక్ యాసిడ్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలు ఎదురైతే యూరిక్‌ యాసిడ్‌ రక్తంలోనే నిలిచిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇవి స్పటికాలుగా మారి కీళ్ల చుట్టూ చేరే ఛాన్స్ ఉంటుంది.

ఇది శరీరం నుంచి బయటకు వెళ్లని పక్షంలో కీళ్లనొప్పులు, గౌట్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. మూత్రవిసర్జన మందులు లేదా నీటి మాత్రలు తీసుకోవడం, అధిక బరువు, సోరియాసిస్, హైపోథైరాయిడిజం ఇతర కారణాల వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. నిమ్మరసం, ఎర్ర క్యాబేజీ, సెలెరీ, టమాటా, కీరా, క్యారెట్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది.

నీళ్లు తీసుకోవడం ద్వారా శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. పాలు, పెరుగు, మజ్జిగ బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. మజ్జిగ, ఎండుడ్రాక్ష, నట్స్ తీసుకోవడం ద్వారా కీళ్ల సంబంధిత సమస్యలు దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.