మనలో చాలామంది బిర్యానీని ఎంతగానో ఇష్టపడతారు. బిర్యానీ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినేవాళ్లు నిమ్మరసం పిండి తినడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిర్యానీలో నిమ్మరసం పిండితే నిమ్మరసంలో ఉండే ఆమ్లత్వం మాంసానికి ప్రత్యేకమైన రుచిని జోడించడంతో పాటు జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
బిర్యానీలో నిమ్మరసం పిండితే అందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అయితే నిమ్మరసం పిండటం వల్ల కొన్ని లాభాలు ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో నష్టాలు ఉన్నాయనే విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. నిమ్మరసం ఎక్కువగా వాడటం వల్ల గ్యాస్, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
నిమ్మరసంలోని ఆమ్లత్వం దంతాల ఎనిమీయాను దెబ్బ తీసే అవకాశాలు కూడా ఉంటాయి. తాజాగా లేని మాంసానికి నిమ్మరసం జోడించడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే గ్యాస్, అజీర్ణం సమస్యలతో బాధ పడే వాళ్లు నిమ్మరసంకు వీలైనంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
తరచూ నిమ్మరసం వాడటం వల్ల ఆరోగ్యానికి దీర్ఘకాలంలో నష్టం కలుగుతుందని చెప్పవచ్చు. నిమ్మరసం వల్ల లాభాలు ఎక్కువగానే ఉన్నా నష్టాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. నిమ్మరసంను ఎక్కువగా వాడేవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి.