దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఎల్ఐసీ ద్వారా ప్రతి నెలా డబ్బులు పొందాలని భావించే వాళ్లకు జీవన్ శాంతి ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. యాన్యుటీ ప్లాన్ అయిన ఈ ప్లాన్ ద్వారా పెన్షన్ రూపంలో డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ సింగిల్ ప్రీమియం డిపర్డ్ యాన్యుటీ ప్లాన్ అయిన ఈ పాలసీని తీసుకోవడం ద్వారా గ్యారంటీ యాన్యుటీ రేటుతో పాటు ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి అనుగుణంగా పెన్షన్ లభిస్తుంది. ఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్, డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ ఆప్షన్లు ఉండగా నచ్చిన ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఆప్షన్ ను మార్చుకునే అవకాశం లేకపోవడంతో జాగ్రత్తగా ఆప్షన్ ను ఎంచుకోవాలి.
గరిష్టంగా 79 సంవత్సరాల వయస్సు వరకు ఈ పాలసీలో చేరే అవకాశం ఉంటుంది. కనీసం లక్షన్నర రూపాయల నుంచి ఎంత మొత్తానికైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. 30 ఏళ్ల వయస్సులో 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ఐదేళ్ల డిఫర్మెంట్ ఆప్షన్ ద్వారా ఏడాదికి 86,000 రూపాయలు పొందవచ్చు. ఈ పాలసీ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిది.
45 సంవత్సరాల వయస్సులో ఐదేళ్ల డిఫర్మెంట్ ఆప్షన్ తో ఈ పాలసీ తీసుకుంటే 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఏడాదికి 90,000 రూపాయలు పెన్షన్ రూపంలో లభిస్తాయి. ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తం పెన్షన్ లభిస్తుంది. సమీపంలోని ఎల్.ఐసీ ఏజెంట్ లేదా ఎల్.ఐ.సీ కార్యాలయంను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.