ఎల్ఐసీలో పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లలో చాలామంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని పొందాలని భావిస్తుంటారు. ఇలాంటి ఎల్ఐసీ పాలసీలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. న్యూ టెక్ టర్మ్ పేరుతో ఎల్ఐసీ ఈ పాలసీని అమలు చేస్తోంది. ఈ పాలసీ నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ కాగా పొగ త్రాగని వారికి ఒక విధంగా, పొగ త్రాగేవాళ్లకు మరో విధంగా ప్రీమియం రేట్లు ఉంటాయి.
ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆసక్తి ఉన్నవాళ్లు ఈ పాలసీని కొనుగోలు చేసే ఆప్షన్ ఉంటుంది. సమీపంలోని ఏజెంట్ల ద్వారా పాలసీని కొనుగోలు చేయడం సాధ్యం కాదని చెప్పవచ్చు. ఆన్ లైన్ లో మాత్రమే ఈ పాలసీ అందుబాటులో ఉండటం వల్ల ఈ పాలసీ గురించి ఎక్కువమందికి అవగాహన లేదు. ఇన్‌క్రీజింగ్ సమ్ అష్యూర్డ్ లేదా లెవెల్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్లలో ఒక ఆప్షన్ ను ఈ పాలసీని తీసుకున్న వాళ్లు ఎంచుకోవచ్చు.
సింగిల్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం లేదా లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆఫ్షన్స్ ద్వారా ఈ పాలసీని తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు వార్షిక ప్రీమియంకు ఏడు రెట్లు లేదా మరణించిన నాటి వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105 శాతం లభించే అవకాశం అయితే ఉంటుంది. సింగిల్ ప్రీమియం ఎంచుకున్న వాళ్లకు మాత్రం 125 శాతం లేదా ఇచ్చిన హామీ మొత్తం లభిస్తుంది.
65 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు కాగా పాలసీ టర్మ్ కనీసం 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలుగా ఉంది. కనీస సమ్ అష్యూర్డ్ రూ.50 లక్షలు కాగా ఈ పాలసీకి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. ఈ పాలసీకి మెచ్యూరిటీ వయస్సు 80 సంవత్సరాలుగా ఉండనుంది. ఎవరైతే ఈ పాలసీ తీసుకుంటారో వాళ్లకు డెత్ బెనిఫిట్ లభిస్తుంది. 20 ఏళ్ల వ్యక్తి కోటి రూపాయల పాలసీ తీసుకుంటే రూ.7,047 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆప్షన్ 2 ఎంచుకున్నవారికి సమ్ అష్యూర్డ్ పెరుగుతూ 15 వ ప్రీమియం చెల్లించే సమయానికి రూ.2 కోట్ల కవరేజీ లభిస్తుంది.