ఎల్ఐసీ సూపర్ పాలసీ.. సింగిల్ ప్రీమియంతో 10 రెట్లు ఎక్కువ మొత్తం పొందే అవకాశం?

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను ప్రకటిస్తూ పాలసీదారులకు ప్రయోజనం కలిగేలా చేస్తున్నాయి. ఎల్ఐసీ ధన్ వృద్ధి పేరుతో సింగిల్ ప్రీమియం పాలసీగా ఈ పాలసీ అమలవుతోంది. 2023 సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ పాలసీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్స్, సింగిల్ ప్రీమియం ప్లాన్ అయిన ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

ఈ పాలసీ తీసుకుంటే పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే ఆర్థికంగా ఈ పాలసీ ద్వారా మద్దతు లభిస్తుంది. సింగిల్ ప్రీమియం పాలసీ కాబట్టి భవిష్యత్తులో ప్రీమియం చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు. 60 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. కనీస సమ్ అష్యూర్డ్ రూ.1,25,000 కాగా గరిష్ట పరిమితి లేకపోవడం గమనార్హం.

గరిష్టంగా 18 సంవత్సరాల టర్మ్ తో ఈ పాలసీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆప్షన్ 1 లో సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ 1.25 రెట్లు కాగా ఆప్షన్2 లో సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ 10 రెట్లు ఉంటుంది. పాలసీ హోల్డర్ గ్యారంటీ బెనిఫిట్స్ ను సైతం పొందవచ్చు. 36 ఏళ్ల వ్యక్తి 10 ఏళ్ల టర్మ్‌తో ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటే రూ.8,16,720 ప్రీమియం చెల్లించాలి. డెత్ బెనిఫిట్ రూపంలో రూ.11.6 లక్షల వరకు పొందవచ్చు.

ఆప్షన్2 ఎంచుకుంటే రూ.9,00,184 ప్రీమియం చెల్లించల్సి ఉండగా డెత్ బెనిఫిట్ రూ.87.9 లక్షలు పొందవచ్చు. పాలసీ తీసుకున్న మూడు నెలల తర్వాత రుణం తీసుకోవచ్చు. సమీపంలోని ఎల్.ఐ.సీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.