ఆలస్యంగా నిద్ర లేచే అలవాటు ఉన్నవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇన్ని ప్రమాదకర సమస్యలు వస్తాయా?

మనలో చాలామంది ఆరోగ్యంగా జీవనం సాగించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో చిట్కాలు పాటిస్తారు. బరువు పెరుగుతామనే భయంతో కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటారు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకునే వారు సైతం ఆలస్యంగా నిద్ర లేచే అలవాటును మాత్రం మార్చుకోరు. అయితే ఈ ఒక్క తప్పు వల్ల ఎన్నో కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.

కొంతమంది నైట్ షిప్ట్ లలో పని చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే నైట్ షిప్ట్ లలో పని చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావడంతో పాటు జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఆలస్యంలో ఆహారం తీసుకోవడం ద్వారా మలబద్ధకం, పైల్స్ ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆలస్యంగా నిద్రలేచే అలవాటు ఉన్నవాళ్లు మధుమేహం బారిన పడే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది.

మధుమేహం బారిన పడితే ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించే ఛాన్స్ ఉంది. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కు మధుమేహం కారణమవుతుందని చెప్పవచ్చు. ఆలస్యంగా నిద్రలేచే వాళ్లను గుండెజబ్బులు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఊబకాయం వల్ల జీవక్రియలలో వేగం తగ్గి కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పవచ్చు.

ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల ఒత్తిడి, చిరాకు, ఇతర సమస్యలు వస్తాయి. రోజూ ఆలస్యంగా నిద్ర లేచేవాళ్లు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆలస్యంగా నిద్రలేచే వాళ్లు ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.