ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లలో చాలామంది కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. కీళ్ల నొప్పులు ఉన్న వారికి వానాకాలంలో ఇబ్బందులు అధికమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చల్లని వాతావరణం కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగించే అవకాశం అయితే ఉంటుంది. గాల్లో పీడనం, తేమ శాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు కీళ్లపై ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి.
కండరాలు గట్టిపడటం వల్ల కీళ్లనొప్పులు అంతకంతకూ పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చెడు ఆహార అలవాట్ల కారణంగా కీళ్ల నొప్పుల సమస్య పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఆర్థరైటిస్ వంటి వ్యాధులతో బాధపడే వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. బరువు నియంత్రణలో ఉంచుకోవడం, తగినంత నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం, ఒంటికి వెచ్చదనం తగిలేలా దుస్తులు ధరించడం, తేమ వాతావరణానికి దూరంగా ఉండటం ద్వారా కీళ్ల నొప్పులకు చెక్ పెట్టవచ్చు.
వ్యాయామాలు చేయడం ద్వారా కూడా కీళ్ల నొప్పులకు చెక్ పెట్టవచ్చు. చలి, తేమ వాతావరణం కారణంగా కీళ్లల్లో ఇన్‌ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా కీళ్లు, కండరాలు పట్టేసినట్టుగా అనిపించే అవకాశాలు అయితే ఉంటాయి. పీడనం తగ్గినప్పుడు కీళ్ల వద్ద ఉన్న కణజాలం కొద్దిగా వాపు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
కీళ్ల మధ్య సినోవియల్ ఫ్లూయిడ్ అనే ద్రవం కీళ్లలో రాపిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి మేలు చేస్తాయని చెప్పవచ్చు. ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే.. ఎముకలు దృఢంగా మారడంతో పాటు చర్మానికి పోషణ అందే అవకాశం అయితే ఉంటుంది. కీళ్ల వద్ద పసుపు నూనెతో మర్దనా చేసినా రిలీఫ్ ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.