కానుగ చెట్టు ఔషధ గుణాలు తెలుసా.. అద్భుతమైన లాభాలు మీ సొంతం అవుతాయట!

కానుగ చెట్టు ఔషధ గుణాలతో నిండి ఉంది. ఇది చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, మూలవ్యాధి, క్యాన్సర్, మరియు ఇతర అనారోగ్యాలకు చికిత్సలో సహాయపడుతుంది. కానుగ గింజల పొడిని పసుపుతో కలిపి చర్మంపై రాసుకోవడం ద్వారా చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కానుగ ఆకులను నూనెలో వేసి మరిగించి, ఆ నూనెను కీళ్ళపై రాసుకోవడం ద్వారా కీళ్ళ నొప్పులు, వాపు తగ్గుతాయి. కానుగ పువ్వులను మెత్తగా నూరి, పేస్ట్‌ను మూలవ్యాధి ఉన్న చోట రాసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

కానుగ ఆకులలోని కరెంజిన్, పొంగాపిన్, ప్యూరనో ఫ్లేవనాయిడ్స్ అనే శక్తివంతమైన పదార్థాలు మెదడు, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్లను నివారించడంలో సహాయపడతాయి. కానుగ చెట్టు పుల్లతో పళ్ళు తోముకోవడం ద్వారా పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తస్రావం, హెమోరాయిడ్స్, పైల్స్, పొత్తికడుపులో కణితులు, అల్సర్లకు కానుగ చెట్టు వివిధ భాగాలు ఉపయోగపడతాయి. కానుగ చెట్టు ఔషధ గుణాలను ఉపయోగించే ముందు, వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

ఇప్పటికే చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. కానుగ చెట్టును ఆయుర్వేదంలో కూడా విరివిగా వినియోగిస్తారు. కానుగ చెట్లు గింజల పొడికి, పసుపు కలిసి పేస్ట్ లా చేసుకుని లేపనంగా రాయడం వల్ల గజ్జి, తామర వంటి వ్యాధులు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి.

కానుగ చెట్లు గింజల పొడికి, తెల్ల గన్నేరు వేరును పేస్ట్ గా చేసి రాసినా కూడా చర్మ సమస్యలు సులువుగా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు. కానుగ గింజల నూనెలో వేప నూనె కలిపి రాస్తే దురదలు పోతాయి. కానుగ చెట్ట బెరడు పొడిని రోజూ ఉదయం, సాయంత్రం ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుంటే పిత్త దోషాలు తొలగిపోతాయని చెప్పవచ్చు.