కాకినాడ కో ఆపరేటివ్ బ్యాంక్ లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

కాకినాడ కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంక్ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు అందించింది. 33 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. క్లర్క్ కమ్ క్యాషియర్ ఉద్యోగ ఖాళీలు 16 ఉండగా ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 9 ఉన్నాయి. అటెండర్ (సబ్ స్టాఫ్) ఉద్యోగ ఖాళీలు 5 ఉండగా అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు 2, మేనేజర్-లా ఉద్యోగ ఖాళీ 1 ఉంది.

ఇంటర్మీడియట్, డిప్లామా, డిగ్రీ, పీజీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అనుభవం కూడా కచ్చితంగా ఉండాలి. 2023 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీ సమయానికి 34 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారు. బీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

వెబ్ సైట్ నుంచి దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకుని దరఖాస్తులను నింపిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కాకినాడ కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, రామారావు పేట, కాకినాడ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది. అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది. నిర్ణీత మొత్తంతో డిడి తీసి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.