ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి ఉద్యోగం సాధిస్తే మాత్రమే సమాజంలో విలువ ఉంటుంది. ఒక ఉద్యోగం కోసం 1000 మంది పోటీ పడుతున్న నేపథ్యంలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అయితే నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాబ్ మేళాను నిర్వహించనున్నారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్ లో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ జాబ్ మేళా జరగనుంది.
ఈ జాబ్ మేళాలో గూగుల్ పే కూడా పాల్గొననుండటంతో నిరుద్యోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. పది, ఇంటర్ చదివి బైక్, ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 15 వేల రూపాయల వేతనంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా లభించే అవకాశాలు అయితే ఉంటాయి.
సర్టిఫికెట్ల జిరాక్స్ లతో విద్యార్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు పోటీ ఊహించని స్థాయిలో ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. 9848895937 నంబర్ ను సంప్రదించడం ద్వారా ఈ జాబ్ మేళా గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.
గూగుల్ పే సంస్థ పెద్ద సంస్థ కాగా ఈ సంస్థలో చిన్న ఉద్యోగం చేసినా కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలపై ఫోకస్ పెట్టడం ద్వారా కెరీర్ కు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం 40 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ కానున్నాయి.