బీటెక్ అర్హతతో ఇస్రోలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. రూ.56,100 వేతనంతో?

నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఈ మధ్య కాలంలో ఇస్రో నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్లు వెలువడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇస్రో నుంచి సైంటిస్ట్, ఇంజనీర్ల ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏకంగా రూ.56,100 వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.

2023 సంవత్సరం జూన్ నెల 14వ తేదీ నాటికి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 303 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

బీఈ, బీటెక్ పాసైన వాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. కనీసం 65 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇస్రో వెబ్ సైట్ లో కెరీర్స్ ట్యాబ్ ను క్లిక్ చేసి ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. 100 మార్కులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష కాల వ్యవధి 120 నిమిషాలుగా ఉండనుంది.