లివర్ శరీరంలో అతి ముఖ్యమైన భాగం. శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, శరీరంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. కొవ్వును తగ్గించడంలో, కార్బోహైడ్రేట్లను నిల్వ ఉంచడంలో, ప్రోటీన్లను తయారు చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైములను తయారుచేస్తుంది.
మన శరీర భాగాలలో అతి ముఖ్యమైన లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే సహజ పద్ధతిలో తీసుకునే ఆహార పదార్థాల వల్ల లివర్ క్లీన్ అయ్యి ఆరోగ్యంగా ఉంటుంది అని వైద్య నిపుణుల సమాచారం. మన శరీరంలోని జీవకోశ నాళ నుండి వచ్చే రక్తాన్ని వడబోస్తుంది. శరీరంలో వ్యర్థాలను తొలగించి, జీవక్రియను ప్రోత్సహిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా చేరాలన్న, విష పదార్థాలు బయటికి పోవాలన్న లివర్ సక్రమంగా పనిచేయాలి.
లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్స్, ఆల్కహాల్, మత్తు పదార్థాలు, బయట ఫుడ్డు తగ్గించాలి లేదంటే కాలేయ సమస్యలు వస్తాయి. నేరేడు పండులో ఫైటో కెమికల్స్ కలంగా ఉంటాయి కాబట్టి నేరేడు పండు తినడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మ పండు రసం తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి.
ఇవి క్రిప్టోనైట్స్, ఫ్రీ రాడికల్స్ కణాలను నాశనం చేయడానికి దోహదపడి లివర్లోని వ్యర్ధాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. శరీరం డి టాక్స్ అవుతుంది. ఆల్ బకరాలో పాలీ పెనాల్స్ మెండుగా ఉంటాయి. నాన్ ఆల్కహాలిక్ లివర్ సమస్యలను దూరం చేయడానికి సహాయం చేస్తుంది.
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి లివర్లో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించి లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాకరకాయ లో మేమోర్డికా చరాంటియ అనే కాంపౌండ్, లివర్ లోని ఎంజైన్లు యాంటీ ఆక్సిడెంట్ తో బలోపేతం అయ్యేవిధంగా చేసి కాలేయ సమస్యలను దూరం చేస్తుంది. మూత్ర సమస్యలు కూడా దూరం అవుతాయి.