Alcohol Teaser: ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆల్కహాల్’ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసే, ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుందనే నమ్మకాన్ని టీజర్ కలిగించింది. ‘ఆల్కహాల్’ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ డ్రామా అని తెలిపేలా టీజర్ ను అద్భుతంగా రూపొందించారు. మద్యం కథానాయకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, తాగడానికి ముందు మరియు తాగిన తరువాత అతని ప్రవర్తన, మరియు దాని చుట్టూ జరిగే సంఘటనల సమాహారాన్ని ఈ టీజర్ సూచిస్తుంది.

హాస్యం మాత్రమే కాకుండా, నవరసాలను అద్భుతంగా పలికించగల నటుడిగా పేరుగాంచిన అల్లరి నరేష్, ‘ఆల్కహాల్’ రూపంలో మరో వైవిధ్యమైన చిత్రాన్ని అందించబోతున్నారు. ఇందులో ఆయన సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఈ సినిమాతో నరేష్, పూర్తిగా కొత్త మార్గంలో అడుగుపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రేక్షకులలో ఉత్సుకతను పెంచుతుంది.

సుహాస్ నటించిన ‘ఫ్యామిలీ డ్రామా’తో విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందిన దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి ఆయన, బలమైన సాంకేతిక విలువలతో కూడిన అద్భుతమైన కథాంశంతో తిరిగి వస్తున్నారు. ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

‘ఆల్కహాల్’ టీజర్ లో సాంకేతిక నిపుణుల ప్రతిభ అడుగడుగునా కనిపించింది. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రాహకుడిగా జిజు సన్నీ, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.

రుహాని శర్మ, నిహారిక ఎన్.ఎం., సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, వెంకటేష్ కాకుమాను మరియు కిరీటి వంటి ఆకట్టుకునే తారాగణం నటించడం ఈ చిత్ర ప్రధాన బలాలలో ఒకటని చెప్పవచ్చు. అదే విషయం టీజర్ లో స్పష్టమైంది.

Alcohol - Official Teaser | Allari Naresh, Ruhani Sharma, Niharika Nm  | Meher Tej | S Naga Vamsi

అల్లరి నరేష్, సత్య కలయికలో పండే వినూత్న హాస్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వీరి కలయిక, ఈ మిస్టరీ మరియు థ్రిల్లింగ్ డ్రామాకు వినోద పొరలను జోడిస్తుంది.

ఈ చిత్రం జనవరి 1, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. నూతన సంవత్సర కానుకగా థియేటర్లలో అడుగుపెట్టి, ప్రేక్షకులకు నాలుగు రోజుల వారాంతపు విందును అందించనుంది.

తారాగణం: అల్లరి నరేష్, రుహాని శర్మ, నిహారిక ఎన్.ఎం., సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, వెంకటేష్ కాకుమాను, కిరీటి

రచన, దర్శకత్వం: మెహర్ తేజ్
సంగీతం: గిబ్రాన్
ఛాయాగ్రహణం: జిజు సన్నీ
కూర్పు: నిరంజన్ దేవరమానే
కళా దర్శకుడు: విశాల్ అబానీ
సహ రచన: ఉద్భవ్ రఘునందన్
సహ నిర్మాత: వెంకట్ ఉప్పుటూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Internal Conflict in Janasena Party Leaders | Pawan Kalyan | Chandrababu | Telugu Rajyam