ఇంటి కిటికీలను ఇలా శుభ్రం చేస్తున్నారా? జాగ్రత్త.. వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే ఇలా చేయండి!

మన ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించుకోవాలంటే ఇంట్లోకి సక్రమంగా గాలి, వెలుతురు వచ్చే కిటికీలను అమర్చుకోవాలి.అయితే ఈ కిటికీల వెంబడి గాలి, వెలుతురుతో పాటు దుమ్ముదూలి కొన్ని రకాల వైరస్లు,బ్యాక్టీరియా ఫంగస్ క్రిమి కీటకాలు కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంటాయి. అలాగని రోజంతా కిటికీలను మూసి ఉంచితే ఇంట్లోకి సరైన గాలి వెలుతురు లభించక తీవ్ర అసౌకర్యానికి గురవుతాము. కావున కిటికీలను తప్పనిసరిగా తెరిచే ఉంచాలి.కాకపోతే కిటికీలను తరచూ శుభ్రం చేస్తుంటే వాటికి పట్టి ఉండే దుమ్ము ధూళి కణాలను, ఉప్పొడి రేణువులు, బ్యాక్టీరియా వంటివి నశించిపోతాయి తద్వారా శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.

వారంలో రెండు లేదా మూడుసార్లు కచ్చితంగా కిటికీలను శుభ్రం చేసుకోవాలి. శ్వాసకోశ వ్యాధులైన ఉబ్బసం, ఆస్మా సమస్యతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధారణ తడిబట్టతో కిటికీలను శుభ్రం ఎలాంటి ఫలితం ఉండదు అందుకే నీటిలో అమోనియం మిశ్రమాన్ని లేదా బోరిక్ పౌడర్ని తగిన పరిమాణంలో కలుపుకొని కిటికీలను శుభ్రం చేసుకుంటే కిటికీలకు పట్టి ఉండే దుమ్ముదులి తొలగిపోవడమే కాకుండా ప్రమాదకర బ్యాక్టీరియా వైరస్ లు కూడా నశించిపోతాయి.

వంటింటి కిటికీలోనుంచి బొద్దింకలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే బోరిక్ పౌడర్, చక్కర , గోధుమపిండి మిశ్రమంతో చిన్న ఉండలు చేసి కిటికీ గోడల వెంబడి ఉంచితే ఇంట్లోకి బొద్దింకలు, చీమలు రావడాన్ని నివారించవచ్చు. అలాగే బిర్యానీ ఆకుల పౌడర్ ని విండోస్ ఉన్నచోట ఉంచితే బొద్దింకలు, దోమలు, ఈగలు, బల్లులు ఇంట్లోకి రాకుండా అక్కడ్నుంచి పారిపోతాయి.