ఒక మనిషి జీవితంలో విజయం సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే ఎన్నో కష్టాలను అధిగమించాల్సి ఉంటుంది. ఇలా ఒక మనిషి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఫేస్ చేయాలనే దానికి సంబంధించి చాణక్యుడు గొప్ప విషయాలు చెప్పారు. కుటుంబ బాంధవ్యాలు, స్నేహం, రాజకీయం, వైవాహిక జీవితం, అర్థశాస్త్రంపై ఆయన ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఈ విషయాలను ‘చాణక్య నీతి’గా పిలుస్తారు. చాణిక్యుడు తన నీతి గ్రంధం ద్వారా మనిషి ఎదుగుదలకు ఉపయోగపడే ఎన్నో విషయాలను తెలియచేశారు.అయితే కొన్నిసార్లు చాలామంది నమ్మిన వారి చేతిలోనే మోసపోవడం జరుగుతుంది.
ముఖ్యంగా స్నేహితులు నమ్మించి మోసం చేయడంతో చాలామంది ఎంతోకొమిలిపోతూ ఉంటారు అయితే మనంఏ బంధంలో అయితే ఉన్నాము ఆ బంధం నమ్మకమైనది లేదా అని ఎలా తెలుసుకోవాలో చాణిక్యుడు తన నీతి గ్రంధం ద్వారా తెలిపారు. మరి ఈ లక్షణాలు కనుక మీరు రిలేషన్ లో ఉన్న వారిలో ఉంటే వారిని నమ్మవచ్చని చాణిక్యుడు తెలిపారు. జీవితంలో త్యాగాలు చేయడం అంత సులభం కాదని చాణక్యుడు చెప్పారు. మీరు ఎవరినైనా పరీక్షించుకోవాలంటే, అవతలి వ్యక్తి త్యాగనిరతను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఒక వ్యక్తి తన సంతోషాన్ని ఇతరుల ఆనందం కోసం త్యాగం చేస్తే.. అలాంటి వ్యక్తి ఎప్పుడూ మోసం చేయడు. కష్ట, దు:ఖ సమయాల్లో మీకు అండగా నిలబడని వారిని దూరంగా ఉంచాలి.
విశ్వాసానికి డబ్బును కూడా ఓ పరీక్షే. డబ్బు సాధారణంగా అందరి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. అయితే, ప్రపంచంలో డబ్బు కంటే ఇతర విషయాలు ముఖ్యమైనవి ఉన్నాయనే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటే.. వారికి డబ్బు ఇచ్చి చూడాలి. ఆ వ్యక్తి డబ్బును తిరిగి ఇస్తే.. మీరు వారిని పూర్తిగా నమ్మొచ్చు. అలాగే ఎలాంటి పరిస్థితులలోనైనా ఎప్పుడూ నిజమే మాట్లాడే వ్యక్తి.. నిత్యం భయం లేకుండా ఉంటారు. అలాంటి నిజాయితీపరులతోనే సన్నిహితంగా ఉండాలని ఆయన సూచిస్తారు. నిస్వార్థంగా, స్పష్టంగా ఉండే వ్యక్తి మీకు మేలు చేస్తారని చాణక్య అంటారు.