కోడిగుడ్లను ఫ్రిజ్ లో స్టోర్ చేయడం వల్ల ఇంత ప్రమాదమా.. ఆ సమస్యలు వస్తాయా?

simply-fridge-organization-2000-2b877749fc924624a7d1669ce3558c55

చాలా మంది ఏదైనా తినే వస్తువంటే చాలు వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటారు. వాటిని వారాలకు వారాలు అందులో పెట్టి మురగ పెడుతుంటారు. ఆ తర్వాతా వాటిని తింటుంటారు. ప్రత్యేకంగా ఒక వస్తువు అని చెప్పలేం కానీ అన్ని పెడుతారు. అందులో ఒకటి కోడిగుడ్డు. వీటిని అప్పడప్పుడు అవసరం మేరకు అని తెచ్చుకోకుండా నెలల క్రితం తెచ్చి ఫ్రిడ్జిలో పెడుతారు. అయితే వీటిని తింటే ఇంత ప్రమాదమని ఈ మధ్యకాలంలోనే తేలింది.

 

సాధారణంగా ఏ ఫ్రిడ్జ్ లో పెట్టిన వస్తువైన కాస్త రుచి తగ్గుతోంది. అంతేకాకుండా వాటి స్థితిని కూడా కోల్పోతోంది. అలాగే కోడుగుడ్లు కూడా ఫ్రిడ్జ్ పెట్టి, ఆ తర్వాత ఉడకబెట్టినప్పుడు దాదాపుగా పగిలిపోతాయి. తరచుగా ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన గుడ్లలోని పోషకాలు విపరీతమైన చలి కారణంగా వెళ్లిపోతాయి. తరచుగా గుడ్లు పైన మురికి ఉంటుంది. వాటిని క్లీన్ చేయకుండా ఫ్రిజ్‌లో ఉంచుతారు. తద్వారా ఫ్రిజ్‌లోని ఇతర వస్తువులకు సోకుతుంది.

 

గుడ్లు ఫ్రీజ్ అయిన తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. లేదంటే గుడ్డు పెంకుపై బ్యాక్టీరియా పెరుగుదలను వేగవంతం చేస్తుంది. చొచ్చుకుపోయే అవకాశాన్ని పెంచుతుంది. అలాంటి గుడ్లు తినడం ఎంతో ప్రమాదకరం. అయితే మీరు ఇప్పటికీ గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేయాలనుకుంటే ఈ మార్గాలు పాటించండి.

 

మీ ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్‌ గది ఉష్ణోగ్రత వద్దకు దగ్గరగా ఉండేలా గుడ్లను ఉంచండి. ఇది గుడ్లు తాజాగా ఉంచడంతో పాటు పాడైపోయే ప్రమాదాన్ని చాలా మేరకు తగ్గిస్తుంది. గుడ్లను తేమ లేని వాతావరణంలో ఉంచండి. లేదంటే ఎక్కువ తేమ గుడ్లను పాడు చేస్తుంది.

 

ఎప్పుడూ కూడా గుడ్లను అవసరం మేరకే తెచ్చుకోండి.తెచ్చిన తర్వాత వీలైనంత తర్వాగా వాటిని ఆహారంగా తీసుకుంటే

బాగుంటుందని నిపుణలు చెబుతున్నారు.