చేపనూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా.. ఆ సమస్యలు దూరమవుతాయా?

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో చేపనూనె గురించి వినే ఉంటారు. చేపనూనె వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ ను కలిగి ఉన్న చేపనూనె ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది. ఎక్కువ జిడ్డు కలిగిన చేపల కణజాలం నుండి చేపనూనెను సేకరిస్తారు. సాల్మన్, వైట్ ఫిష్, హెర్రింగ్, సర్డినెస్ అనే చేపల నుంచి ప్రధానంగా ఈ నూనెను సేకరిస్తారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం వారానికి రెండు చేపలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చేప నూనెలో 30 శాతం ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ మిగిలిన 70 శాతం ఖనిజాలతో,పోషకాలు ఉంటాయి. చేప నూనె అనేక సమర్ధవంతమైన ఆరోగ్య లక్షణాలను కలిగి ఉండటంతో పాటు క్యాన్సర్ సమస్యకు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది. బరువును తగ్గించే విషయంలో చేపనూనె ఎంతో సహాయపడుతుంది.

చేపనూనె తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అధిక బరువును తగ్గించడంతో పాటు ఎన్నో సమస్యలకు చెక్ పెట్టడంలో చేపనూనె సహాయపడుతుంది. చేపనూనె వల్ల మానసిక వ్యాధులు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. వృద్దాప్యంలో దృష్టి లోపం రాకుండా చేయడంలో చేపనూనె ఉపయోగపడుతుంది. నొప్పులను నివారించుటలో చేపనూనె ఉపయోగపడుతుంది.

చేపనూనె వాడటం వల్ల శారీరక, మానసిక ఎదుగుదలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ మరియు పెద్దప్రేగు కాన్సర్ లాంటి సమస్యలను చేప నూనె దూరం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో చేప నూనె ఉపయోగపడుతుంది. అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ తో బాధ పడేవాళ్లు చేపనూనెను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. చర్మ సౌందర్యానికి సైతం చేపనూనె ఉపయోగపడుతుంది.