పరుపు మీద వాడే బెడ్ షీట్లను ఎన్ని రోజులకు ఉతకాలో తెలుసా.. అలా చేస్తే ఇబ్బందేనా?

మనం ప్రశాంతంగా నిద్ర పోవాలంటే బెడ్ రూమ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. బెడ్ షీట్లు, తల దిండు, దిండు కవర్ లను చాలామంది ఉతకకుండా ఎక్కువ రోజుల పాటు వినియోగిస్తూ ఉంటారు. ఎన్ని రోజులకు ఒకసారి బెడ్ షీట్లు మార్చాలనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి. బెడ్ షీట్ల కారణంగా చాలా అలర్జీలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.

బెడ్ షీట్ శుభ్రంగా లేకపోతే బ్యాక్టీరియా, దుమ్ము బెడ్ షీట్ పై చేరే అవకాశాలు అయితే ఉంటాయి. రాత్రి నిద్రపోయిన సమయంలో చెమట, చర్మ కణాలు, తలకు పెట్టుకున్న నూనె, కాళ్లలోని తేమ బెడ్ షీట్ ను అంటుకుంటాయి. ఉతికిన బెడ్ షీట్లు వాడుతూ ఉంటే పడుకోవడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. బెడ్ షీట్లను వ్యక్తిగత సమయాన్ని బట్టి ఉతుక్కోవాల్సి ఉంటుంది.

చిన్నపిల్లలు ఉన్నవాళ్లు మూడు రోజులకు ఒకసారి బెడ్ షీట్ మారుస్తుంటే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. చెమట అధింగా పట్టేవారు, అలర్జీ సమస్యలు ఉన్నవారు బెడ్ షీట్ ను కనీసం వారానికి ఒకసారి ఉతకడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. రాత్రి పూట చెమట ఎక్కువగా పట్టకుండా ఒంటరిగా నిద్రపోయే వారు రెండు వారాలకు ఒకసారి అయినా బెడ్ షీట్ ఉతకాలి. ఒకే దుస్తుల్లో ఉంటూ శుభ్రత పాటించని వారు వారానికి ఒకసారి బెడ్ షీట్ మార్చుకోవడం ఉత్తమమని చెప్పవచ్చు.

వేడి నీటిలో బెడ్ షీట్లను నానబెట్టి తరువాత ఉతకాలి. వేడి నీటిలో నానబెట్టడం వల్ల దుమ్ము, పురుగులు, బ్యాక్టీరియా నశించడంతో పాటు బెనిఫిట్స్ కలుగుతాయి. ఉతికిన బెడ్ షీట్లను ఎప్పుడూ ఎండలో ఆరేయాలి. ఉతికిన తరువాత బెడ్ షీట్లను మడత పెట్టి వెచ్చని ప్రదేశంలో, పొడిగా ఉన్న ప్రదేశంలో భద్రపరచాలి. బెడ్ షీట్ల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.