పండ్లపై ఉండే ఈ స్టిక్కర్లకు అర్థం తెలుసా.. ఈ స్టిక్కర్ల వెనుక ఇంత కథ ఉందా?

మనలో చాలామంది ఆపిల్ పండ్లను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. యాపిల్ పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే యాపిల్ పండ్లు కొనుగోలు చేసే సమయంలో ఆ పండ్లపై కొన్నిసార్లు స్టిక్కర్లను చూస్తూ ఉంటాం. కొంతమంది మాత్రం స్టిక్కర్లు ఉన్న పండ్లు నాణ్యమైన పండ్లు అని స్టిక్కర్లు లేని పండ్లు నాణ్యత లేని పండ్లు అని ఫీలవుతుంటారు.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం పండు నాణ్యత, ధర ఇంకా పండును ఎలా పండించారనే సమాచారాన్ని స్టిక్కర్ల ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది మాత్రం పండ్ల ఉత్పత్తిలోని లోపాలను దాచిపెట్టడానికి మన దేశంలో పండ్లపై ఈ స్టిక్కర్లను అతికిస్తున్నారని తెలుస్తోంది. పండ్లకు స్టిక్కర్లను అంటించడానికి గమ్ లేదా జిగురును ఉపయోగిస్తారు.

అలాంటి పండ్లను తినడం వల్ల నష్టం తప్ప లాభం ఉండదు. పండుపై ఉన్న స్టిక్కర్ లో మొదటి నంబర్ 8 ఉంటే సేంద్రీయ పద్ధతిలో ఆ పండ్లను పండించారని అర్థం చేసుకోవాలి. మొదటి నంబర్ 9 అయితే పాత వ్యవసాయ పద్ధతులను అనుసరించి ఈ పండ్లను పండించారని అర్థం చేసుకోవచ్చు. 3 లేదా 4 నంబర్ తో కోడ్ ప్రారంభమైతే మాత్రం ఎరువులు, పురుగుమందులు ఉపయోగించి పండించినవి అని అర్థం చేసుకోవచ్చు.

ఎరువులు, పురుగుమందులు వాడిన పండ్లు తీసుకోవడం ద్వారా నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పవచ్చు. తరచూ పండ్లను తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పండ్లు తినడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది కానీ కొన్ని పండ్లు తింటే మాత్రం ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది.