ఫ్రిడ్జ్ లో అస్సలు ఉంచకూడని 10 కూరగాయలు ఇవే.. ఇవి ఉంచితే చాలా ప్రమాదమంటూ?

ప్రస్తుత కాలంలో ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉండదనే సంగతి తెలిసిందే. అయితే ఫ్రిడ్జ్ లో దొరికిన ప్రతి వస్తువును చాలామంది ఉంచేస్తూ ఉంటారు. కొన్ని వస్తువులను మాత్రం ఫ్రిడ్జ్ లో అస్సలు ఉంచకూడదు. కొన్ని కూరగాయలను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల అవి త్వరగా చెడిపోయే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫ్రిడ్జ్ లో అస్సలు ఉంచకూడని వాటిలో బంగాళదుంపలు ఒకటి. బంగాళదుంపలను ఎప్పుడూ పొడి ప్రదేశంలో మాత్రమే ఉంచాలి.

టమోటా పండ్లను సైతం ఫ్రిడ్జ్ లో ఎప్పుడూ ఉంచకూడదు. రూమ్ టెంపటేచర్ దగ్గర టమోటా పండ్లను నిల్వ ఉంచితే మంచిది. ఉల్లిపాయలను సైతం ఫ్రిడ్జ్ లో ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉల్లిపాయలను నిల్వ చేస్తే హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. వెల్లుల్లిని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా మెష్ బ్యాగ్ లేదా గాలి తగిలే మరో బ్యాగ్ లో పెడితే మంచిదని చెప్పవచ్చు.

బ్రెడ్ ను సైతం ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. బ్రెడ్‌ను గది ఉష్ణోగ్రత వద్ద బ్రెడ్‌బాక్స్ లేదా సీల్డ్ కంటైనర్‌లో ఉంచడం ద్వారా బ్రెడ్ చెడిపోయే అవకాశం అయితే ఉండదు. తేనె ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే రూమ్ టెంపరేచర్ దగ్గర నిల్వ ఉంచాలి. కాఫీ గింజలను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల రుచి పోయే ఛాన్స్ ఉంటుంది. అవకాడోలు ఫ్రిడ్జ్ లో ఉంచితే అవి చెడిపోయే అవకాశాలు ఉంటాయి.

పుచ్చకాయలు, పచ్చి మిర్చీలను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశాలు ఉంటాయి. ఫ్రిడ్జ్ లో ఏ వస్తువులను ఉంచాలో ఏ వస్తువులను ఉంచకూడదో తెలుసుకుంటే మంచిది. హాట్ సాస్ లను సైతం ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల చెడు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.