మన దేశంలో వేర్వేరు వంటకాల కోసం నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిమ్మకాయ సహాయంతో నిమ్మకాయ పులిహోర, నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ పానకం, నిమ్మకాయ జ్యూస్, నిమ్మ సోడా తయారు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. విదేశాల్లో సైతం నిమ్మకాయలను విరివిగా ఉపయోగిస్తారు. అయితే అక్కడ చింతపండుకు బదులుగా పులుపు కోసం నిమ్మకాయను వాడటం జరుగుతుంది.
ఒక నిమ్మకాయలో 35 మిలి గ్రాముల విటమిన్ సి ఉంటుంది. రోజుకు ఒక నిమ్మకాయ తీసుకునే వారిలో విటమిన్ సి లోపం వచ్చే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు. తాజా నిమ్మరసం తీసుకోవడం ద్వారా విటమిన్ సి లోపం వచ్చే అవకాశాలు అయితే ఉండవు. నిమ్మరసంలో ఉండే సహజ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి సంబంధిత సమస్యలను దూరం చేయడంతో పాటు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ ఆమ్లాలు ఉండగా జీవక్రియను బలోపేతం చేయడంలో ఇవి సహాయపడతాయి. నిమ్మకాయ తొక్కలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు మెదడు అభివృద్ధిని పోత్సహించడంతో పాటు పీహెచ్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. లిమోనెన్, ఫ్లేవనాల్ గ్లైకోసెడ్ లతో సహా 22 రకాల రసాయనాలు నిమ్మరసంలో ఉండగా నిమ్మరసం తీసుకుంటే క్యాన్సర్ కణతులు ఏర్పడే అవకాశాలు అయితే కచ్చితంగా తగ్గుతాయని చెప్పవచ్చు.
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్లను నివారించడంలో తోడ్పడుతుంది. నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతుంటే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ప్రతిరోజూ నిమ్మరసాన్ని తీసుకోవడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్ఛు. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండగా ఇవి విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
నిమ్మరసంలో పొటాషియం ఉండగా రోజూ తాజా నిమ్మరసాన్ని తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుందని చెప్పవచ్చు. నిమ్మరసం గుండె ఆరోగ్యంగా ఉండటంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మరసం పరిమితంగా తీసుకుంటే మాత్రమే ఈ హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.