ఇండియన్ కోస్ట్ గార్డ్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. joinindiancoastguard.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్ నెల 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. మొత్తం 46 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా జనరల్ డ్యూటీ ఉద్యోగ ఖాళీలు 25, టెక్ ఉద్యోగ ఖాళీలు 20, లాలో ఉద్యోగ ఖాళీ 1 ఉంది. దేశం కోసం పని చేయాలని భావించే వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఇంటర్, బీటెక్, ఇతర డిగ్రీలు చేసి కనీసం 60 శాతం మార్కులు సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్, ఫైనల్ సెలక్షన్ బోర్డ్, ఇండక్షన్ ప్రక్రియ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ జరగనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండగా మిగిలిన అభ్యర్హులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. joinindiancoastguard.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.