దేశంలో బీటెక్ చదివిన విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇండియన్ ఆర్మీ బీటెక్ చదివిన విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఇండియన్ ఆర్మీలో 196 ఉద్యోగ ఖాళీల కోసం తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.
బీటెక్ లో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. బీటెక్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సమాచారం.
మెరిట్ ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బెంగళూరులో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలను రెండు దశలలో నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు వైద్య పరీక్షల ద్వారా ఎంపిక కావడం జరుగుతుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా బీటెక్ పాసైన వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలిగిస్తుంది. వైద్య పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 56100 రూపాయలు వేతనంగా లభిస్తుంది.