రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ ను సులభంగా పెంచుకోవాలా.. ఈ చిట్కాలు పాటిస్తే చాలంటూ?

red_blood_cells_9-sixteen_nine

వర్షాకాలంలో ఎక్కువమందిని వేధించే వ్యాధులలో డెంగ్యూ ఒకటి కాగా ఈ వ్యాధి బారిన పడిన వాళ్లను వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే ఉంటుంది. మలేరియా, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడినా కూడా ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. శరీరంలో ప్లేట్ లెట్స్ ఉండటం వల్ల రక్తం సులువుగా గడ్డ కడుతుంది. ఈ విధంగా జరగడం వల్ల రక్తస్రావం అయితే త్వరగా కోలుకోవచ్చు.

ప్రతి ఒక్కరి శరీరంలో 2.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్లేట్ లెట్స్ ఉంటాయి. రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గితే మాత్రం వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నల్లగా విరేచనాలు అవుతున్నా, చర్మం ఎరుపు రంగులోకి మారుతున్నా, చర్మం దద్దుర్లు వస్తున్నా, చిగుళ్ల నుంచి ముక్కు నుంచి రక్తం వస్తున్నా ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గిందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ప్లేట్ లెట్స్ తగ్గడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్లు సైతం ఉన్నారు. గుండె సంబంధిత వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా ప్లేట్ లెట్స్ తగ్గుతాయి. క్యారెట్, విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న కురగాయలను తీసుకుంటే మంచిది. గుమ్మడికాయ తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. గుమ్మడి గింజలు సైతం ప్లేట్ లెట్స్ సమస్యలను దూరం చేస్తాయి.

దానిమ్మ, బొప్పాయి ఆకులు, గోధుమ గడ్డి, ఎండు ద్రాక్ష, బీట్ రూట్, విటమిన్ సి ఫుడ్ తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. విటమిన్ కే ఫుడ్, అరటిపండ్లు తీసుకోవడం ద్వారా కూడ ప్లేట్ లెట్స్ సమస్యలకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. బీ12 ఫుడ్, బీట్ రూట్ కూడా ప్లేట్ లెట్ కౌంట్ సమస్యలకు చెక్ పెట్టడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.