ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు కావాలంటే సింహ విగ్రహాన్ని ఇలా పెట్టాలి..?

సాధారణంగా ఒక మనిషి జీవితంలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. సమాజంలో మనిషి తన మనుగడు కొనసాగించాలంటే డబ్బు చాలా అవసరం. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఎంత కష్టపడి పనిచేసిన కూడా సంపాదించిన డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ ఉంటుంది. అటువంటి సమయంలో కొన్ని రకాల పరిహారాలు పాటించటం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఈ క్రమంలో
ఇంట్లోని వాస్తుకు మరింత బలాన్ని చేకూర్చేందుకు ఇంట్లో కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటే సరిపోతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఇంట్లో అలంకరణ కోసం కొన్ని రకాల విగ్రహాలు పెట్టుకుంటారు. అలాగే మరికొన్నింటిని పూజ గదిలో ఉంచి పూజిస్తారు. ఈ క్రమంలో ఒక కాంస్య సింహ విగ్రహాన్ని ఇంట్లో సరైన దిశలో ఉంచటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఒక పెద్ద సైజ్‌లో ఉన్న సింహం కాంస్య విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే అది ఇంటి అంతటికీ పాజిటివ్ ఎనర్జీని ప్రసారం చేస్తుంది. అయితే వాస్తు నియమాల ప్రకారం ఆ విగ్రహాన్ని ఈశాన్య దిశగా ఉంచితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇలా ఈశాన్య దిశగా సింహ విగ్రహాన్ని ఉంచటం వల్ల ఇంట్లో ఎదురైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే పాజిటివ్ ఎనర్జీ వల్ల ఆ ఇంట్లోకి సిరి సంపదలు వచ్చి చేరుతాయి.

ఇలా ఇంట్లో ఈశాన్య దిశలో సింహ విగ్రహం ఉంచడమే కాకుండా వంట గదిలో కూడా రెండు చిన్నవైన కాంస్య పాత్రలు లేదా, చిన్నవైన సింహం కాంస్య విగ్రహాలను ఆగ్నేయ దిశగా వేలాడదీస్తే ఆ ఇంట్లో శ్రేయస్సు సమృద్ధిగా లభిస్తుంది. ఇలా చేయటం వల్ల ఇంటి వాస్తు దోషం తెలియకపోయి ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి అన్యోన్యంగా ఉండటమే కాకుండా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. కాంసెన్ సింహ విగ్రహాన్ని ఇంట్లో ఉంచటం వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంటిదరిదాపులకు రాకుండా కాపాడుతుంది.