నిమ్మకాయ, నిమ్మతొక్క వల్ల కలిగే ఉపయోగాలు తెలుసా.. ఇన్ని లాభాలున్నాయా?

మనలో చాలామంది నిమ్మకాయ, నిమ్మతొక్క వల్ల ఎలాంటి లాభం లేదని ఫీలవుతూ ఉంటారు. అయితే వాస్తవం ఏంటంటే నిమ్మకాయ, నిమ్మతొక్క వల్ల ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. కాలంతో సంబంధం లేకుండా నిమ్మరసం తాగితే కాస్త చురుకు, ఒంటిలో తాజాదనం వస్తుందనే సంగతి తెలిసిందే. చర్మం ఆరోగ్యం కోసం నిమ్మను ఉపయోగించడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు.

నిమ్మకాయను సగానికి కోసి ముఖంపై మసాజ్‌ చేసినట్లు రుద్దితే మంటగా అనిపిస్తున్డనే సంగతి తెలిసిందే. అయితే ఈ విధంగా చేయడం ద్వారా డార్క్ సర్కిల్స్ ను సులువుగా రిమూవ్ చేయవచ్చు. నిమ్మకాయలు కొల్లాజిన్ ఉత్పత్తికి ఉపయోగపడటంతో పాటు చర్మం పాడవ్వకుండా చేయడంలో సహాయపడుతుంది. టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం, తేనె సమపాళ్లలో కలిపితే ఫేస్ ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది.

మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిముషాలు ఆగిన తర్వాత ఫేస్‌వాష్‌ చేసుకోవడం ద్వారా ఫేస్ ఫ్రెష్ గా ఉంటుంది. చిన్న అలొవెరా ఆకులోని జెల్‌ తీసుకుని దానికి నిమ్మరసం కలిపి ముఖంమీద ఉండే నల్లటి వలయాల దగ్గర పట్టిస్తే బెస్ట్ రిజల్ట్స్ పొందవచ్చు. నిమ్మరసంలోకి కొద్దిగా పసుపు వేసి పేస్ట్‌ను ముఖానికి లేదా నొప్పులు ఉండే చోటు పట్టిస్తే నొప్పులు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి.

కోడిగుడ్డు తెల్లసొన, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని పట్టిస్తే చర్మం ఫ్రెష్ గా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. నిమ్మరసంలో బేకింగ్‌ సోడా వేసి మిశ్రమాన్ని వినియోగిస్తే ఆ మిశ్రమం డియోడ్రెంట్‌లా పని చేసే అవకాశం ఉంటుంది. నిమ్మరసం చర్మ సమస్యలకు, జుట్టు సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంది. నిమ్మతొక్కను ఎండబెట్టి దాన్ని పొడిగా చేసుకొని రెండు టేబుల్‌ స్పూన్ల రోజ్‌ వాటర్‌ వేసి పేస్ట్‌కు సరిపడినట్లు రోజ్‌వాటర్‌ పోసి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కడిగితే చర్మం మిలమిలా మెరుస్తుంది.