కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడతారా.. కుంకుమ పువ్వు వల్ల కలిగే లాభాలివే!

మనలో చాలామంది కుంకుమ పువ్వు గురించి వేర్వేరు సందర్భాల్లో వినే ఉంటారు. కుంకుమ పువ్వు ఖరీదు చాలా ఎక్కువ మొత్తం అనే సంగతి తెలిసిందే. హై క్వాలిటీ కుంకుమ పువ్వు కిలో 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రెగ్నెన్సీ సమయంలో కుంకుమ పువ్వును తీసుకుంటే పుట్టబోయే బిడ్డ మంచి రంగులో పుట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

కుంకుమ పువ్వును గర్భం దాల్చిన మూడు నెలల తర్వాత మాత్రమే తీసుకోవాలి. కుంకుమ పువ్వు వల్ల గర్భాశయ కండరాల కదలిక పెరగడంతో పాటు సుఖ ప్రసవం జరుగుతుంది. రోజుకు 2 గ్రాముల కంటే తక్కువగా కుంకుమ పువ్వును తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. గర్భాశయ కండరాలు చురుకుగా ఉండేలా చేయడంలో కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో చాలామందిలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి.

బీపీని నియంత్రించడంలో కుంకుమ పువ్వు ఎంతగానో తోడ్పడుతుంది. కాళ్లలో, పొత్తికడుపులో వచ్చే నొప్పులకు చెక్ పెట్టడంలో కుంకుమ పువ్వు పాత్ర ఎంతో ఉంది. కుంకుమ పువ్వు తీసుకోవడం వల ఆందోళన తగ్గుతుంది. నిద్ర బాగా పట్టేలా చేయడంలో కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది. పుట్టబోయే బిడ్డ రంగు జన్యువులపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. పాలలో పంచదార, కొంచెం కుంకుమపువ్వు వేసి మరిగించి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

ఎక్స్ పైరీ డేట్ ఉన్న కుంకుమ పువ్వును మాత్రమే కొనుగోలు చేయాలి. కుంకుమ పువ్వుకు సంబంధించి కల్తీ జరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో కొనుగోలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. క్వాలిటీ కుంకుమ పువ్వును వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. వైద్యుల సలహా మేరకు కుంకుమ పువ్వును తీసుకుంటే ఆరోగ్యానికి మరీ మంచిదని చెప్పవచ్చు.