నిన్నటి కూరలు, వంటకాలను ఈరోజు తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. అవి ఇంతలా హాని చేస్తాయా?

మనలో చాలామంది నిన్న మిగిలిన వంటకాలు, కూరలను ఈరోజు తినడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే అలా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందే తప్ప లాభం ఉండదు. మిగిలిన కూరలపై బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఎక్కువ సమయం మిగిలిన కూరలను అలాగే ఉంచడం వల్ల గాలిలో ఉండే క్రిములు కూరలపై చేరి ఇన్ఫెక్షన్లను కలిగించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

కొన్నిసార్లు కూర పాడై ఉంటుంది. పాడైన ఆహారం తింటే అస్వస్థతకు గురి కావడంతో పాటు వాంతులు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కూరలను పదేపదే వేడి చేసుకుని తినడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎండ వాతావరణంలో కూరలు చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్రిజ్ లో కూరలను పెడితే చెడిపోయే అవకాశం ఉన్నా వాటిని తినవద్దని మరి కొందరు చెబుతున్నారు.

ఉదయం వండిన వంటకాలను సాయంత్రం, సాయంత్రం వండిన వంటకాలను ఉదయం తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. వంటకాలు సద్ది వాసన వస్తే మాత్రం అవి చెడిపోయాయని గుర్తు పట్టవచ్చు. మరీ ఎక్కువ సమయం వంటకాలను అలా ఉంచితే పురుగులు చేరే అవకాశాలు అయితే ఉంటాయి. ఎక్కువ సమయం గాలిలో వంటకాలు ఉంటే నష్టం చేకూరుతుంది.

వంటకాలను నిల్వ ఉంచి తినడం వల్ల ఆరోగ్యానికి చేకూరే నష్టం అంతాఇంతా కాదు. వంటకాలను పరిమితంగా వండుకుని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.