ఇద్దరి మధ్య బంధం పదిలంగా ఉండాలంటే ప్రేమ, నమ్మకం ఎంత ముఖ్యమో వ్యక్తిత్వం కూడా అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. అప్పుడే పెళ్లి కానీ, సహజీవనం కానీ, రిలేషన్ షిప్, స్నేహం కానీ ఎక్కువ రోజులు కొనసాగుతుంది. మనలో వ్యక్తిత్వంలోకించినప్పుడు ఎదుటివారికి చికాకు, అభద్రతాభావం కలిగి ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ తొందరగా బ్రేకప్ కావడానికి కారణం అవుతుంది. ఒక బంధం దీర్ఘకాలం పాటు కొనసాగాలంటే ప్రేమ నమ్మకం తో పాటు వ్యక్తిత్వం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మీ వ్యక్తిత్వాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా కోల్పోకుండా ఉన్నప్పుడే బంధం దృఢంగా ఉంటుంది.
కొంతమంది ఏ చిన్న విషయాన్ని అయినా భాగస్వామితో పంచుకోవాలని అనుకుంటారు. దీనివల్ల ఒక్కొక్కసారి ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. అందుకు మనం మన భాగస్వామితో ఏ విషయాన్ని పంచుకోవాలి, ఏ విషయాన్ని పంచుకోకూడదు అన్నది కచ్చితంగా ముందుగా తెలుసుకోవాలి. మన కాలేజీ రోజుల్లో జరిగిన కొన్ని ఈవెంట్లు, మన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన పార్టీలు ఇలా కొన్ని విషయాలు మన భాగస్వామితో పంచుకోవడం వల్ల ఒక్కొక్కసారి మనస్పర్ధలకు కారణం కావచ్చు. ఇలాంటి కొన్ని సెన్సిటివ్ విషయాలను భాగస్వామితో పదేపదే చెప్పడం వల్ల ఇద్దరి మధ్య కొంత దూరం పెరగొచ్చు అందుకే ఇలాంటి విషయాలను చెప్పకపోవడమే మంచిది.
సాధారణంగా పెళ్లి బంధం తర్వాత మిగతా బంధాలకు దూరమవుతుంటారు. అయితే అది అంత మంచిది కాదంటున్నారు రిలేషన్ షిప్ మేనేజర్స్. ఎప్పుడు మీ భాగస్వామితో కాకుండా అప్పుడప్పుడు మీ ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడం వల్ల మీకంటూ ఓ ప్రపంచం ఉంటుంది. మీ భాగస్వామితో కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలు స్నేహితులతో చెప్పుకోవడం వల్ల మనసు తేలికై అది మీ బంధాన్ని బలంగా ఉంచడానకి దోహదం చేస్తుంది. నీకు సంబంధించిన అన్ని పనులూ కలిసే చేసుకోవాలనుకోవడం మంచిదే. కానీ కొన్ని విషయాల్లో మీ అభిరుచులు మీ పార్ట్నర్ అభిరుచులు వేరువేరుగా ఉంటాయి. అలాంటప్పుడు మీ అభిరుచులను వదులుకొని పనిచేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఇష్టమైన పనులను ఒక్కరే చేసుకుని మీ పార్టనర్ తో ఆ అనుభవాన్ని పంచుకుంటే మీ బంధం మరింత పదిలంగా ఉంటుంది