సాధారణంగా మంచి కలబంద మొక్కను ఆయుర్వేద ఉత్పత్తుల్లోనూ,మనం ప్రతిరోజు వాడే సబ్బులు, షాంపూలు, లోషన్, హెయిర్ ఆయిల్ వంటి సౌందర్య ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కలబంద మొక్కలో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అయితే కలబంద మొక్క గుజ్జును తగిన నియమాలు, జాగ్రత్తలు పాటించి వాడినట్లయితే ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక వ్యాధులను అదుపు చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
ప్రతిరోజు క్రమం తప్పకుండా కలబంద గుజ్జుకు నిమ్మ రసాన్ని జోడించి సేవించినట్లయితే మనలో రోగ నిరోధక శక్తి పెంపొందించడంతోపాటు,శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలు తొలగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీంతో ఊబకాయ సమస్య నుంచి విముక్తి పొందుతారు. అలాగే తీవ్రమైన తలనొప్పి నుంచి ఉపశయనం లభిస్తుంది.
కలబంద గుజ్జుకు నిమ్మరసం, తేనె ,పుదీనా కలిపి జ్యూస్ తయారు చేసుకుని ప్రతిరోజు సేవిస్తే షుగర్ వ్యాధి గ్రస్తులకు దివ్యౌషధంలా పని చేస్తుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు కలబందను నిత్యం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ప్రతిరోజు ఉదయాన్నే కలబంద జ్యూ స్ తీసుకుంటే తీసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థ మెరుపుపడి మలబద్ధకం, విరోచనాలు ,గ్యాస్ట్రిక్, అజీర్తి వంటి సమస్యలను అధిగమించవచ్చు.
కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల ప్రతిరోజు కలబంద జ్యూస్ తాగినట్లయితే శరీర కణాలను నాశనం చేసే ఫ్రీ రాడికాల్స్ తో సమర్థవంతంగా పోరాడి అనేక క్యాన్సర్ కారకాల నుంచి మనల్ని రక్షిస్తుంది.
కలబంద గుజ్జులో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల ప్రతిరోజు కలబంద జ్యూస్ సేవించినట్లయితే కీళ్ల నొప్పులు, కీళ్లవాపు వంటి సమస్యలను అదుపులో ఉంచవచ్చు. వారంలో ఒకసారి కలబంద గుజ్జును తలపై మర్దన చేసుకుంటే జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు తొలగుతాయి.
కాలుష్యం కారణంగా వివిధ చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు కలబంద గుజ్జుతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై నల్లని వలయాలు తొలగి కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. అలాగే కాలిన గాయాలపై కలబంద గుజ్జును రాస్తే గాయం త్వరగా మానుతుంది.
కొందరిలో కలబంద జ్యూస్ తాగడం అలర్జీలకు కారణం కావచ్చు. అలాంటివారు వైద్యుల్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం మంచిది.