నిరుద్యోగులకు అలర్ట్.. లక్ష వేతనంతో ఐసీఎంఆర్‌‌లో భారీగా ఉద్యోగ ఖాళీలు!

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. మొత్తం 79 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం.

జులై 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆఫ్ లైన్ లో అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 26 ఉండగా టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 49, ల్యాబోరేటరీ అటెండెంట్ ఉద్యోగ ఖాళీలు 4 ఉన్నాయి. 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఫస్ట్ క్లాస్‌లో పాసై అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ, బీటెక్ ఫస్ట్ క్లాస్‌లో పాసైన వాళ్లు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డైరెక్టర్, మలేరియా పరిశోధనా సంస్థ, సెక్టార్-8, ద్వారక, న్యూఢిల్లీ- 110077 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.

ఓబీసీ, జనరల్ అభ్యర్థులకు 300 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా మిగతా అభ్యర్థులకు మాత్రం ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. డీఓపీటీ మార్గదర్శకాలు, మెరిట్ ప్రకారం ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే వాళ్లకు కనిష్టంగా 18,000 రూపాయల నుంచి గరిష్టంగా రూ. 1,12,400 వరకు వేతనం లభిస్తుంది.