ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 9995 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ నెల 7వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ జరిగింది. ఐబీపీఎస్ ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్), స్టాఫ్ ఆఫీసర్స్ (స్కేల్-1, 2, 3) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
జూన్ నెల 27వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ibps.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ మోడ్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం డిగ్రీ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలియడంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 850 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 175 రూపాయలుగా ఉండనుంది. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి జూన్ 27 చివరి తేదీగా ఉంది. ఫారమ్‌ను ప్రింట్ తీసుకోవడానికి జులై 12 చివరి తేదీ అని తెలుస్తోంది. ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ పేజ్ ను ఓపెన్ చేసి రిక్రూట్‌మెంట్ లింక్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావడం ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించవచ్చు. ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లర్క్ పోస్టులకు ఈ సంస్థ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను నిర్వహిస్తోంది. రెండు దశల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష జరగనుందని సమాచారం అందుతోంది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.