నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు.. డిగ్రీ, పీజీ అర్హతతో?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. డిగ్రీ, పీజీ అర్హతతో ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. recruitment.nta.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 31వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 28 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని తెలుస్తోంది.

డైరెక్టర్ (గ్రూప్ ఎ), జాయింట్ డైరెక్టర్ (గ్రూప్ ఎ), రీసెర్చ్ సైంటిస్ట్ (గ్రూప్ ఎ) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. డిప్యుటేషన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర విషయాలను తెలుసుకోవడంతో పాటు 56 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిగ్రీ , పీజీ, పీహెచ్ డీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. recruitment.nta.nic.in వెబ్ సైట్ లో రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసి రిజిష్టర్ కావాల్సి ఉంటుంది. ఈ మెయిల్ ఐడీని ఉపయోగించి రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావడం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తులను సమర్పించాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రింట్ అవుట్ తీసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.